Friday, March 13, 2009

తల్లితండ్రుల ఆశలు


తల్లితండ్రులు తమ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వారిని పెంచుతారు. తమ పిల్లలు ఏమి చదవాలో కూడా నిర్ణయించేస్తారు. పిల్లల్ని డాక్టర్ లేదా ఇంజనీరు కావలని కలలు కంటారు. డాక్టర్ లేదా ఇంజనీరు అయితె వారు తమలా కాకుండా, మంచిగా బ్రతుకుతారని వారి నమ్మకం,విశ్వాశం. ఎవరూ ఆక్షేపించలేరు కాని అసలు కధ అక్కడే మొదలు అవుతుంది.

తల్లితండ్రులు వారికి తెలియకుండానే తమ పిల్లల్ని మానసికఒత్తిడికి కారణం అవుతున్నారు. తమ కోలీగ్ పిల్లలతో కంపేర్ చేయడం,ప్రతి విషయానికి విసుక్కోవడం, స్నేహితులముందు చులకనగా మాట్లడం మొదలైన వాటివల్ల మానసిక ఒత్తిడికి లొనై ప్రక్కదోవపడతారన్నది తల్లితండ్రులకు మింగుడు పడని పచ్చి నిజం.

Monday, March 9, 2009

టెక్నాలజి మంచికా చెడుకా

మనము టెక్నాలజిని సరిఐన దారిలో వుపయోగించు కుంటున్నామా, అలా వుపయోగించుకుంటే ముంబొయి దాడిని అడ్డగించలేమా? సమస్య వచ్చినపుడు హడావుడి చేయడం తప్ప మనం ఆ సంగతి పట్టించుకోము. అది మన తప్పు కాదు మీడియా మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది అని నేనంటాను. మరి మీరేమంటారు.

ఏ కాకి జీవితం

"జగమంత కుటుంబం నాది ఎ కాకి జీవితం నాది" అని సినీ కవి అన్నాడు. నాకు అది సరిగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే నాకు బంధువులు చాలా మంది వున్నా నేను పెద్ద వాడిని కాదు చిన్నవాడిని కాను. ఎవరి స్నేహితాలు వారివి. నేను ఎలా నెగ్గుకురావలో తెలియడంలేదు.

Sunday, March 8, 2009

నా కవిత

దాదాపు తొమ్మిది సంవత్సరాలక్రితం సంగతి నా వయసు అపుడు 25. పెళ్ళి కుదిరి తాతాగారి మరణంవల్ల పదిహేను రోజుల తరువాత జరిగింది. ఆ మధ్యకాలంలో నా మనసు లో కవిత ఒకటి పుట్టుకొచ్చింది.

నీనొక సముద్రాన్ని
ఎన్నో సుర్యోదయాలు, మరెన్నో అస్తమయాలు
మది మాటున దాగిన సుడిగుండాలు మరెన్నో,
సాయంకోసం అర్ధించా ఆర్తిగా
సాయం అందివ్వవొచ్చిందో ఒక అమ్రుత హస్తం
అందుకోవాలని చేతినిచాచా,
కాలం సుడిగుండమై మరోసారి కాటువేసింది
వెనక్కిమరిలాయి ఆశలు విరిగిపడిన కెరటంలా,
ఎప్పటికైనా ఆశలతీరంచేరాలని
సాగే అలనై ఎదురు చూసే నేనొక సముద్రాన్ని,
కన్నీటి సముద్రాన్ని
నాకు బాగా గుర్తు ఈ కవిత 2000 ఆంధ్రభూమి డిసెంబరు నెల మాసపత్రిక లో ముద్రితమైంది. మరలా నా మదిలొ ఇటువంటి కవిత పుట్టలేదు. కారణం నా మది స్పందించడంలేదేమో.