Sunday, March 8, 2009

నా కవిత

దాదాపు తొమ్మిది సంవత్సరాలక్రితం సంగతి నా వయసు అపుడు 25. పెళ్ళి కుదిరి తాతాగారి మరణంవల్ల పదిహేను రోజుల తరువాత జరిగింది. ఆ మధ్యకాలంలో నా మనసు లో కవిత ఒకటి పుట్టుకొచ్చింది.

నీనొక సముద్రాన్ని
ఎన్నో సుర్యోదయాలు, మరెన్నో అస్తమయాలు
మది మాటున దాగిన సుడిగుండాలు మరెన్నో,
సాయంకోసం అర్ధించా ఆర్తిగా
సాయం అందివ్వవొచ్చిందో ఒక అమ్రుత హస్తం
అందుకోవాలని చేతినిచాచా,
కాలం సుడిగుండమై మరోసారి కాటువేసింది
వెనక్కిమరిలాయి ఆశలు విరిగిపడిన కెరటంలా,
ఎప్పటికైనా ఆశలతీరంచేరాలని
సాగే అలనై ఎదురు చూసే నేనొక సముద్రాన్ని,
కన్నీటి సముద్రాన్ని
నాకు బాగా గుర్తు ఈ కవిత 2000 ఆంధ్రభూమి డిసెంబరు నెల మాసపత్రిక లో ముద్రితమైంది. మరలా నా మదిలొ ఇటువంటి కవిత పుట్టలేదు. కారణం నా మది స్పందించడంలేదేమో.

No comments:

Post a Comment