Friday, March 13, 2009

తల్లితండ్రుల ఆశలు


తల్లితండ్రులు తమ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వారిని పెంచుతారు. తమ పిల్లలు ఏమి చదవాలో కూడా నిర్ణయించేస్తారు. పిల్లల్ని డాక్టర్ లేదా ఇంజనీరు కావలని కలలు కంటారు. డాక్టర్ లేదా ఇంజనీరు అయితె వారు తమలా కాకుండా, మంచిగా బ్రతుకుతారని వారి నమ్మకం,విశ్వాశం. ఎవరూ ఆక్షేపించలేరు కాని అసలు కధ అక్కడే మొదలు అవుతుంది.

తల్లితండ్రులు వారికి తెలియకుండానే తమ పిల్లల్ని మానసికఒత్తిడికి కారణం అవుతున్నారు. తమ కోలీగ్ పిల్లలతో కంపేర్ చేయడం,ప్రతి విషయానికి విసుక్కోవడం, స్నేహితులముందు చులకనగా మాట్లడం మొదలైన వాటివల్ల మానసిక ఒత్తిడికి లొనై ప్రక్కదోవపడతారన్నది తల్లితండ్రులకు మింగుడు పడని పచ్చి నిజం.

No comments:

Post a Comment